బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి కత్రినా కైఫ్ ఎట్టకేలకు బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌తో ఆమె ప్రేమలో ఉండగా, డిసెంబర్ 9న మూడుమూళ్ల సాక్షిగా వీరిద్దరి భార్యభర్తలు అయ్యారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని హోటల్ సిక్స్ సెన్సెస్ పోర్ట్ బార్వారాలో పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. మెహందీ వేడుక నుంచి కత్రినా ధరించిన లెహంగా వరకు ప్రతిదీ చర్చనీయంశంగా మారగా, పెళ్లిలో కత్రినా ధరించిన దుస్తులు అందరిని ఆకర్షించాయి.
పెళ్లి తర్వాత నూతన వధూవరులు విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌లు భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. డిసెంబర్ 14న ముంబై చేరుకోగా, విమానాశ్రయంలో వారిద్దరు జంటగా కనిపించి కనువిందు చేశారు. ఎయిర్పోర్ట్ ముందు మీడియాతో కొద్ది క్షణాలు ముచ్చటించి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే కత్రినా న్యూ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది.
నుదుట సింధూరం, మెడలో తాలిబొట్టు, పెళ్లి గాజులు ధరించి కొత్త పెళ్లి కూతురు లుక్‌లో కత్రినా ఆకట్టుకుంటోంది. ఫార్మల్ లుక్‌లో విక్కీ కనిపించాడు. ఇలా కత్రినా, విక్కీలు భార్య భర్తలుగా చూడముచ్చటగా కనిపించారు. భార్యభర్తలుగా మారిన విక్ట్రీనాలని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.