ఈ మధ్య కుర్ర హీరోలు సీనియర్ హీరోయిన్స్ మాయలో పడుతున్నారు. కొన్నాళ్లు వారితో డేటింగ్ చేశాక సైలెంట్‌గా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇటీవల కత్రినా కైఫ్ తనకన్నా చిన్నవాడైన విక్కీ కౌశల్‌ని పెళ్లి చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. చాలా రోజుల డేటింగ్ తర్వాత వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 38 ఏళ్ల కత్రినా కైఫ్ తన కంటే 5 ఏళ్లు చిన్నోడైన విక్కీని పెళ్లి చేసుకోవడం అభిమానులని కొంత ఆశ్చర్యపరచింది.
ఇండస్ట్రీలో ఇలాంటి జంటలు చాలానే ఉన్నాయి. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఫాలోయింగ్ ఉన్న ప్రియాంక చోప్రా తన కన్నా పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ని పెళ్లి చేసుకుంది. ఇక సుస్మితా సేన్ నైంటీస్‌లో ఎంతోమంది కుర్రాళ్లని ప్రేమలో పడేసింది. మిస్ యూనివర్స్‌గా కలలరాణిలా మారింది. ఆమె తన కంటే 15 ఏళ్లు చిన్నోడైన మోడల్ రోహమాన్ షాల్‌కి ఫిదా అయ్యింది. ఇద్దరూ లివ్-ఇన్-రిలేషన్లో ఉన్నారు.
ఇక ఐటెం భామ మలైకా అరోరా తన భర్త అర్భాజ్ ఖాన్‌కి విడాకులు ఇచ్చి తన కన్నా చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో రిలేషన్లో ఉంది. అర్జున్ తనకంటే 12 ఏళ్లు చిన్నోడు . ఇక డస్కీ బ్యూటీ బిపాసా బసు తన కంటే నాలుగేళ్లు చిన్నోడైన కరణ్ సింగ్ గ్రోవర్తో ఏడడుగులు వేసింది. ఇలా టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్లలో కూడా కొందరు అందాల భామలు తమ కన్నా చిన్నవాడైన వారిని పెళ్లి చేసుకొని సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.