బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా, విక్కీ కౌశల్ పెళ్లికి సంబంధించి కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతుంది. చాలా సీక్రెట్‌గా వీరి వివాహం జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ వివాహ వేడుకలు డిసెంబర్ 7-12 తేదీల మధ్య జరగనుండగా.. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన హోటల్ బుకింగ్ కూడా పూర్తయిందని కథనాలు వస్తున్నాయి. అంతేకాదు ఈ వీఐపీ వెడ్డింగ్ నిర్వహించడానికి చాలా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు కలిసి పని చేస్తున్నాయని.. వీరు సవాయ్ మాధోపూర్ లోని వివిధ హోటళ్లలో రూమ్స్ బుక్ చేసే పనిలో ఉన్నారని అంటున్నారు.
దీపావళి సందర్భంగా ఇద్దరూ ప్రైవేట్‌గా ‘రోకా’ వేడుకను జరుపుకున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. సినీ నిర్మాత కబీర్ ఖాన్ ఇంట్లో ఈ వేడుక జరిగింది. కత్రినా కబీర్‌ను తన సోదరుడిలా భావిస్తుంది. అందుకే అక్కడ ఈ వేడుకను జరుపుకుంది అని అంటున్నారు.
రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ లో వీరి పెళ్లి జరగనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పరిస్థితిని సమీక్షించేందుకు 10 మంది సభ్యుల బృందం మంగళవారం సిక్స్ సెన్సెస్ బర్వారా కోటకు చేరుకుంది. హోటల్ యాజమాన్యం నుంచి అందిన సమాచారం మేరకు పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను టీమ్ పర్యవేక్షిస్తుందట. కొంత మందిని మాత్రమే పెళ్లికి ఆహ్వానిస్తున్నట్టు టాక్.