Kasturi | ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman), ఆయన భార్య సైరా భాను (Saira Banu) గురించి గత రెండు రోజులుగా నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో రెహమాన్ భార్య తమిళం (Tamil) లో సరిగా మాట్లాడలేకపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆమెపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో రెహమాన్‌ని కూడా ట్రోల్స్ చేశారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ నటి కస్తూరి (Kasturi) కూడా రెహమాన్ భార్య సైరా భానుపై కామెంట్లు చేశారు. ‘ఏమిటీ..? ఏ ఆర్ రెహమాన్ భార్యకు తమిళం తెలియదా ? ఆమె మాతృ భాష ఏమిటి ? ఇంట్లో వారు ఏ భాషలో మాట్లాడతారు..?’ అంటూ తమిళంలో ట్వీట్ చేసింది. కస్తూరి కామెంట్లపై రెహమాన్ స్పందించారు. ‘నా ప్రేమను గౌరవిస్తా’ అంటూ తన భార్యపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
காதலுக்கு மரியாதை🌺😍 https://t.co/8tip3P6Rwx
— A.R.Rahman (@arrahman) April 27, 2023
ఇటీవల తమిళనాడులో ఓ అవార్డుల వేడుక జరిగింది. ఈ వేడుకకు రెహమాన్ తన భార్య సైరాభాను (Saira Banu) తో కలిసి హాజరయ్యారు. వేదికపై తన భార్యతో కలిసి అవార్డు కూడా అందుకున్నారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడారు. ఆ తర్వాత సైరాభానును కూడా మాట్లాడాలని నిర్వాహకులు కోరారు. దీంతో ఆమె మాట్లాడటానికి రెడీ అవుతుండగా.. రెహమాన్ కల్పించుకుని హిందీ (Hindi)లో కాకుండా తమిళ్ (Tamil)లో మాట్లాడాలని ఆమెకు సూచించారు. అందుకు సైరాభాను స్పందిస్తూ.. ‘నాకు తమిళం అంతగా మాట్లాడేందుకు రాదు’ అంటూ ఇంగ్లీష్‌లో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ముఖ్యంగా రెహమాన్ చేసిన పనికి మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Also Read..
Filmfare Awards 2023 | అట్టహాసంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుక.. ఉత్తమ నటిగా ఆలియా భట్
Sudha Murty | నా కుమార్తె తన భర్తను ప్రధానిని చేసింది : సుధా మూర్తి