Udhayanidhi Stalin : సినిమాలకు ఉదయనిధి స్టాలిన్ గుడ్ బై !
ఉదయనిధి స్టాలిన్ | రెండేళ్ల కిందటి నుంచే ఉదయనిధి రాజకీయాల్లో బిజీ అయ్యాడు. అంతకుముందు వరకు సినిమాలతోనే బిజీగా ఉన్నాడు.

నిర్మాతగా 13 సంవత్సరాలు.. హీరోగా 8 ఏళ్లలో 13 సినిమాలు.. సక్సెస్ఫుల్ సినీ జర్నీ. ఇలాంటి సమయంలో ఆయన సినిమాల నుంచి దూరం అవుతున్నాడంటూ ప్రచారం. ఇంతకీ ఎవరు ఆయన అనుకుంటున్నారా ! ఆయనెవరో కాదు.. దిగ్గజ నేత కరుణానిధి ( Karunanidhi ) మనువడు ఉదయనిధి స్టాలిన్ ( Udhayanidhi Stalin ). తమిళనాడు అసెంబ్లీ ఎన్నిక( Tamilnadu Assembly Elections )ల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్తలు వినిపిస్తున్నాయి. అప్పట్లో తాత కరుణానిధి నిలబడిన చెపాక్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాడు ఉదయనిధి స్టాలిన్. డీఎంకే ( DMK ) పార్టీ అధికారంలోకి రావడంతో స్టాలిన్ ( Stalin ) మంత్రివర్గంలోకి ఉదయనిధిని తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

రెండేళ్ల కిందటి నుంచే ఉదయనిధి స్టాలిన్ రాజకీయాల్లో బిజీ అయ్యాడు. అంతకుముందు వరకు సినిమాలతోనే బిజీగా ఉన్నాడు. నిర్మాతగా విజయ్, సూర్య, కమల్ హాసన్ లాంటి అగ్ర హీరోలతో సినిమాలు చేశాడు. 2012లో ఓకే ఓకే సినిమాతో హీరోగా మారాడు ఉదయనిధి స్టాలిన్. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఈ తొమ్మిదేళ్లలో 13 సినిమాలు చేశాడు. అందులో దాదాపు 7 సినిమాలు హిట్ అయ్యాయి. కరుణానిధి కూడా రాజకీయాల్లోకి రాకముందు సినిమాలకు పనిచేశాడు. అప్పట్లో ఆయన దాదాపు 75 సినిమాలకు కథలు అందించాడు. తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ అటు సినిమాలు, ఇటు రాజకీయాలు చేస్తున్నాడు ఉదయనిధి స్టాలిన్. అయితే ఇన్ని రోజులు పరిస్థితి వేరు.. ఇప్పుడు పరిస్థితి వేరు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలవడం, త్వరలోనే మంత్రి కూడా కాబోతుండటంతో ఇకపై సినిమాలకు సమయం దొరకదు అంటూ వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ చేతిలో ఒక సినిమా ఉంది. అయితే అది ఎప్పుడు మొదలవుతుందో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని ఉదయనిధి స్టాలిన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి దర్శక నిర్మాతలు కూడా ఓకే అంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. హీరోగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా అన్ని చోట్ల విజయం అందుకున్న ఉదయనిధి.. ఇప్పుడు రాజకీయాల్లో కూడా విజయంతోనే మొదలు పెట్టాడు. మరి ఇక్కడ ఆయన ప్రయాణం ఎలా ఉండబోతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Stalin : నాన్న లేడు.. అన్న అండ లేదు.. అయినా గెలిపించాడు
Rajinikanth : తమిళనాడు రాజకీయాల నుంచి తలైవా తెలివిగా తప్పించుకున్నాడా?
Udhayanidhi Stalin : తాతకు తగ్గ మనవడు.. తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా గెలుపు
Tamilnadu Assembly Elections : పాత సంప్రదాయాన్నే ఫాలో అయిన తమిళులు
రాహుల్ గాంధీ ప్రచారం చేసిన స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్
ఈ నెల 7న సీఎంగా స్టాలిన్ ప్రమాణం
వైరల్ అవుతున్న 1980నాటి మమతా బెనర్జీ ఫొటో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

