Bhool Bhulaiyaa 3 | బాలీవుడ్ హార్రర్ కామెడీ ప్రాంఛైజీ చిత్రాల్లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న ప్రాజెక్ట్ భూల్ భూలైయా . కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan)లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రానికి కొనసాగింపుగా ఇప్పటికే సీక్వెల్ ‘భూల్ భూలైయా-2’ రాగా.. తాజాగా భూల్ భూలైయా-3 (Bhool Bhulaiyaa 3) కూడా వచ్చేస్తుంది. త్రీక్వెల్‌లో కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టీజర్‌కు నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ట్రైలర్‌ను కూడా లాంచ్ చేశారు. కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్, తృప్తి డిమ్రి అండ్ టీంతో ఫన్, సస్పెన్స్, రొమాంటిక్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్ చెబుతోంది.
డైరెక్టర్ అనీశ్ బజ్మీ తాజా మూవీలో విద్యాబాలన్ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్తో గూస్బంప్స్ తెప్పించడం ఖాయమని టీజర్, ట్రైలర్ క్లారిటీ ఇచ్చేశాయి. 2007లో ప్రియదర్శన్ డైరెక్షన్లో వచ్చిన ఫస్ట్ పార్ట్‌లో అక్షయ్‌కుమార్, విద్యాబాలన్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఫస్ట్ పార్టుతో పాటు సీక్వెల్ కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మరి థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎలాంటి ఇంప్రెషన్ కొట్టేస్తుందో చూడాలంటున్నారు సినీ జనాలు.
భూల్ భూలైయా 3 ట్రైలర్..
‘BHOOL BHULAIYAA 3’ TRAILER IS HERE: ZABARDAST… 1 NOV *DIWALI* RELEASE… Director #AneesBazmee delivers a solid punch with #BhoolBhulaiyaa3Trailer… Horror-comedy is the flavour of the season and #BhoolBhulaiyaa3 lives up to the MASSIVE EXPECTATIONS.#RoohBaba | #Manjulika |… pic.twitter.com/DfacI2zGHo
— taran adarsh (@taran_adarsh) October 9, 2024
Read Also :
Naga Chaitanya | సుహాస్ జనక అయితే గనక నాగచైతన్య చేయాల్సిందట.. మరి ఏమైందంటే..?
Prabhas | క్రేజీ న్యూస్.. ప్రభాస్ వెడ్డింగ్ అనౌన్స్మెంట్ ఆన్ ది వే..!
Salaar 2 | సలార్ 2లో కాటేరమ్మ ఫైట్‌ను మించిపోయే సీక్వెన్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే..!