తమిళ అగ్ర హీరో కార్తీ కథానాయకుడిగా వచ్చిన ‘సర్దార్’ చిత్రం తెలుగులో కూడా మంచి విజయం సాధించిన విషయం విదితమే. ఆ సినిమాకు కొనసాగింపుగా రూపొందుతున్న ‘సర్దార్ 2’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టీం అందరూ కలిసి సెట్లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలని మేకర్స్ విడుదల చేశారు.
ప్రీక్వెల్ని మించేలా ఈ సీక్వెల్ ఉంటుందని, ‘సర్దార్’గా మరోసారి కార్తీ నట విశ్వరూపాన్ని ప్రేక్షకులు చూస్తారని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని మేకర్స్ తెలిపారు. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య ఓ పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. ప్రీక్వెల్ని తెరకెక్కించిన పిఎస్ మిత్రన్ ఈ సీక్వెల్కి కూడా దర్శకుడు. ఈ చిత్రానికి కెమెరా: జార్జ్ సి.విలియమ్స్, సంగీతం: యువన్ శంకర్ రాజా, నిర్మాత: ఎస్.లక్ష్మణ్ కుమార్.