Karthikeya 2 – Nithiin | 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఈసారి తెలుగు సినిమాలకు నిరాశే ఎదురైన విషయం తెలిసిందే. గతేడాది పురస్కారాల్లో ‘ఆర్ఆర్ఆర్’ ‘పుష్ప’ చిత్రాలతో సత్తా చాటిన టాలీవుడ్ ఈసారి ఒక్క అవార్డు గెలుచుకోవడమే గగనమైంది.
యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తాజాగా నేషనల్ ఫిలిం అవార్డుల్లో సత్తా చాటింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరిలో ఈ చిత్రం అవార్డు గెలుచుకుంది. బలగంతో పాటు మేజర్, సీతారామం ఈ పోటీలో ఉండగా.. కార్తికేయ ఈ అవార్డును దక్కించుకుంది. అయితే ఈ సినిమా అవార్డు గెలుచుకోవడంపై ప్రేక్షకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ సినిమాకు సపోర్ట్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతుండగా.. మరికొందరు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తెలుగులో కార్తికేయ కంటే మంచి సినిమా దొరకలేదా అని కామెంట్లు పెడుతున్నారు.
అయితే కొందరు అభిమానులు కార్తికేయ 2 సినిమాకు అవార్డు రావడంతో నటుడు నితిన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదేంటి కార్తికేయ సినిమాలో హీరో నిఖిల్ అనుకుంటున్నారు కదా.! అవును హీరో నిఖిలే కానీ ఈ సినిమా వలన ఫేమస్ అయ్యింది నితిన్.
అసలు విషయం ఏంటంటే.. కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ అందుకున్నందుకు మూవీ టీంను ప్రత్యేకంగా కలుద్దాం అనుకున్నాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. అందుకోసం తన సిబ్బందితో ప్రత్యేకంగా ఆహ్వానం పంపించాడు. అయితే ఈ ఆహ్వానం హీరో నిఖిల్‌కు వెళ్లకుండా. హీరో నితిన్‌కు వచ్చింది. ఇక నితిన్ కూడా ఎందుకు పిలుస్తున్నాడో అని కలవడానికి వెళ్లాడు అంట. అయితే నితిన్‌ను జేపీ నడ్డా కలిసిన అనంతరం కార్తికేయ 2 బాగుంది. మీ నటన చాలా నచ్చింది అన్నాడు అంట. దీంతో షాక్ తిన్న నితిన్. సార్ ఆ సినిమాలో నేను హీరో కాదు నిఖిల్ సిద్ధార్థ్ అని చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో వార్తలు ఫుల్ వైరల్ అయ్యాయి. ఇదిలావుంటే ప్రస్తుతం నిఖిల్ సినిమాకు అవార్డు రావడంతో నితిన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కార్తికేయ సినిమాకు అవార్డు రావడంలో రాజకీయ కోణం ఉన్నట్లు ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఈ సినిమా నిర్మాత ప్రస్తుతం కేంద్రంలో ఉన్న పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయని అందుకే ఈ సినిమాకు అవార్డు వచ్చినట్లు తెలుపుతున్నారు.
Best Telugu film
Congrats @actor_nithiin https://t.co/TWIBUHb4so
— Raghava (@belongs2raghu) August 16, 2024
Congrats @actor_nithiin https://t.co/ktC98ThPxk
— . (@24by7_Chiraku) August 16, 2024