Retro Movie | తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన సూపర్ హిట్ చిత్రం రెట్రో. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, శ్రియ ప్రత్యేక గీతంలో కనిపించారు. 65 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను సూర్య, జ్యోతిక నిర్మించారు. మే 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తెలుగులో మిశ్రమ స్పందనలను అందుకోగా.. తమిళంలో మాత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు.
నాలుగు నెలల్లో ‘రెట్రో’ సిరీస్ వెర్షన్ విడుదల చేయాలని తాను ఆలోచిస్తున్నట్లు సుబ్బరాజు ప్రకటించారు. ఈ ఎక్స్టెండెడ్ వెర్షన్లో కేవలం తొలగించిన సన్నివేశాలు మాత్రమే కాకుండా, అనేక భావోద్వేగపూరిత సన్నివేశాలు మరింత వివరంగా ఉండేలా ప్లాన్ వేస్తున్నానని ఆయన తెలిపారు. అయితే, ఈ విషయంలో నెట్‌ఫ్లిక్స్ సుముఖంగా లేదని, అందుకే వారితో చర్చలు జరుపుతున్నానని సుబ్బరాజు పేర్కొన్నారు. ‘రెట్రో’ను కొన్ని ఎపిసోడ్లుగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని, ఒక్కో ఎపిసోడ్ సుమారు 40 నిమిషాలు ఉండేలా చూస్తున్నానని చెప్పారు. హాస్యం, ప్రేమ, యాక్షన్ వంటి అంశాలను ఒక్కో ఎపిసోడ్లో హైలైట్ చేయాలనేది తన ఆలోచన అని సుబ్బరాజు వెల్లడించారు.