వరస ఫ్లాపులు.. అయినా స్టార్ హీరోలతో సినిమాలు.. కార్తీక్ సుబ్బరాజ్ మాయ !
ఈ రోజుల్లో ఒక్క ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడినే చాలామంది పట్టించుకోవడం లేదు. అలాంటిది హ్యాట్రిక్ ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడితో సినిమాలు చేయడం అనేది అసాధ్యమే. కానీ వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్నా కూడా ఓ దర్శకుడిని నమ్మి స్టార్ హీరోలు అవకాశాలు ఇస్తున్నారు స్టార్ హీరోలు. ఆ దర్శకుడి పేరు కార్తీక్ సుబ్బరాజ్.

ఈ రోజుల్లో ఒక్క ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడినే చాలామంది పట్టించుకోవడం లేదు. అలాంటిది హ్యాట్రిక్ ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడితో సినిమాలు చేయడం అనేది అసాధ్యమే. కానీ వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్నా కూడా ఓ దర్శకుడిని నమ్మి స్టార్ హీరోలు అవకాశాలు ఇస్తున్నారు స్టార్ హీరోలు. ఆ దర్శకుడి పేరు కార్తీక్ సుబ్బరాజ్.

పిజ్జా, జిగర్తాండా వంటి సినిమాలతో కార్తీక్ సుబ్బరాజ్ మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలి రెండు సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనం రేపాడు. విభిన్న సినిమాల దర్శకుడిగా పేరు సంపాదించాడు. కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ తగ్గిపోతూ వచ్చింది. కొన్నాళ్లుగా ఆయన సినిమాలో ఆ పాత మ్యాజిక్ కనబడడం లేదు. ప్రభుదేవాతో చేసిన మెర్క్యురీ.. రజినీకాంత్ పేట.. ధనుష్ జగమే తంత్రం సినిమాలు దారుణంగా నిరాశ పరిచాయి. ఈ మూడు ప్లాపులతో కార్తీక్ క్రేజ్ కూడా పడిపోయింది. అయినా అదేమీ చిత్రమో మరి.. స్టార్ హీరోలు ఈయనతో సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. తాజాగా కార్తీక్ సుబ్బరాజ్ సినిమాకు చియాన్ విక్రమ్ ఓకే చెప్పాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఒక భారీ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు మహాన్ అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది.
మహాన్ సినిమాలో విక్రమ్ కొడుకు ధ్రువ కూడా నటిస్తున్నాడు. సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎన్ని ఫ్లాప్ సినిమాలు తీస్తున్న కూడా.. కార్తీక్ మళ్లీ మళ్లీ స్టార్ హీరోలు ఎలా ఒప్పిస్తున్నాడో..! ఈ కిటుకు తెలియక చాలా మంది దర్శకులు తలలు పట్టుకుంటున్నారు. మరి కనీసం విక్రమ్ సినిమాతో అయినా కార్తీక్ ఫామ్‌లోకి వస్తాడో లేదో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
గుండెపోటుతో కేరళకు చెందిన ప్రముఖ నటి మృతి..!
OTT | మెల్లిమెల్లిగా ఓటీటీలు టాలీవుడ్‌ను కమ్మేస్తున్నాయా?
మెగా డాటర్ డెబ్యూ మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు అన్నో.. సినిమాలకు గుడ్ బై వార్తలపై మంచు మనోజ్ క్లారిటీ
సెక్స్ రాకెట్ నడుపుతున్న మోడల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

