కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటిస్తోన్న చిత్రం సుల్తాన్. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్ ప్రభు నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ జై సుల్తాన్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.
కార్తీ, రౌడీ లతో కలిసి డ్యాన్స్ చేస్తున్న పాట ఊరమాస్ గా ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. రౌడీలపై ఆధిపత్యం చెలాయించే సుల్తాన్‌గా కార్తి కనిపిస్తుండగా, పల్లెటూరి యువతిగా రష్మిక మందన్న నటిస్తోంది. యాక్షన్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదలకానుంది.