Meiyazhagan Movie | కోలీవుడ్ స్టార్ నటులు కార్తీ (Karthi), అరవింద స్వామి (Aravindha Swamy) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మెయ్యళగన్ (Meiyazhagan). ఈ సినిమాకు ’96’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన ప్రేమ్ కుమార్.సీ (Prem Kumar C) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదే సినిమాను తెలుగులో ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గరపడటంతో వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్రబృందం. ఇప్పటికే మూవీ నుంచి తమిళ టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా తెలుగు టీజర్‌ను వదిలారు.
ఈ టీజర్ చూస్తుంటే.. ’96’ లాంటి లవ్ స్టోరీతో ఆకట్టుకున్న ప్రేమ్ కుమార్ ఈసారి ఫ్రెండ్షిప్ బ్యాక్‌డ్రాప్ మూవీ తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో కార్తీ, అరవింద్ స్వామి స్నేహితులుగా నటిస్తున్నారు. కథను రివీల్ చేయకుండా క్లాస్‌గా ఉంది ఈ టీజర్. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య- జ్యోతిక(Suriya – Jyothika) నిర్మిస్తుండగా.. రాజ్ కిరణ్, శ్రీదేవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 96 సినిమా సంగీత దర్శకుడు గోవింద్ వసంత (Govindha Vasantha) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.