Meiyazhagan Movie | కోలీవుడ్ స్టార్ నటులు కార్తీ(Karthi), అరవింద స్వామి (Aravindha Swamy) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మేయలగన్ (Meiyazhagan). (తెలుగులో నిజం + అందమైన అని అర్థం). ఈ సినిమాకు ’96’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన ప్రేమ్ కుమార్.సీ (Prem Kumar C) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్లో అరవింద స్వామి సైకిల్ నడుపుతుండగా.. కార్తీ సంతోషంతో మునిగి తెలుతున్నట్లు ఉన్నాడు. ఇక ఈ పోస్టర్ గమనిస్తే.. ఫ్రెండ్షిష్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య- జ్యోతిక(Suriya – Jyothika) నిర్మిస్తుండగా.. రాజ్ కిరణ్, శ్రీదేవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 96 సినిమా సంగీత దర్శకుడు గోవింద్ వసంత (Govindha Vasantha) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
One from our Hearts..! #Meiyazhagan #மெய்யழகன் @Karthi_Offl #Arvindswamy #PremKumar #Jyotika #GovindVasantha @SDsridivya @rajsekarpandian @2D_ENTPVTLTD @SakthiFilmFctry pic.twitter.com/yxee04Bq8D
— Suriya Sivakumar (@Suriya_offl) May 24, 2024