‘హను-మాన్’ఫేం తేజ సజ్జా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’. ఇందులో తేజ సజ్జా సూపర్ యోధాగా కనిపించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2డి, 3డి ఫార్మాట్లలో, ఎనిమిది భాషల్లో వచ్చే నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
బాహుబలి, దేవర చిత్రాలను బాలీవుడ్లో విడుదల చేసిన అగ్ర నిర్మాత కరణ్ జోహార్ ‘మిరాయ్’ చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తుండటం విశేషం. మంచు మనోజ్ విలన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయిక. శ్రియ శరణ్, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి రచన: మణిబాబు కరణం, సంగీతం: గౌరహరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి.