Vijay Devarakonda | విజయ్ దేవరకొండ చేసిన మొదటి పాన్ ఇండియా సినిమా లైగర్. విడుదలకు ముందు ఈ చిత్రం చాలా హైప్‌ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాతో బాలీవుడ్ టాక్ అఫ్ ది టౌన్‌గా నిలచాడు విజయ్. కానీ సినిమా మాత్రం ఆశించినంత విజయం సాధించలేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్న సమయంలోనే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, విజయ్‌తో ఓ సినిమా చేస్తానని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది.
విజయ్‌తో చేయబోయే సినిమా కోసం ఓ సౌత్ డైరెక్టర్ని వెతుకుతున్నారట కరణ్ జోహార్. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ తర్వాత బాలీవుడ్ నిర్మాతలకు సౌత్ దర్శకులపై మరింత గురి కుదిరింది. షారుఖ్‌ని మునుపెన్నడూ లేని విధంగా ప్రజెంట్ చేశాడు అట్లీ. ఇప్పుడు విజయ్‌తో చేయబోయే సినిమాకి కూడా సౌత్ డైరెక్టర్ అయితేనే బావుటుందని కరణ్ జోహార్ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సినిమా సెట్స్‌పై వెళ్ళే ఛాన్స్ వుంది. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో బిజీగా వున్నారు విజయ్. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.