సారా అలీఖాన్ కీలక పాత్రలో కరణ్ జోహార్ నిర్మించిన తాజా చిత్రం ‘ఏ వతన్ మేరే వతన్’. ఇమ్రాన్ హష్మి, సచిన్ ఖేడ్కర్, అభయ్ వర్మ, స్పార్ష్ శ్రీవాత్సవ, అలెక్స్ ఓ నేలి, ఆనంద్ తివారీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కణ్ణన్ అయ్యర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేరుగా ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుపుతూ అమెజాన్ ప్రైమ్ గ్లింప్స్‌ను ఇంటర్నెట్లో విడుదల చేసింది.
భారతదేశ చరిత్రలో ఇప్పటిదాకా ప్రస్తావించని సరికొత్త అధ్యాయాన్ని ఈ సినిమా ద్వారా ఆవిష్కరించనున్నట్లు అమెజాన్ ప్రైమ్ ఈ వీడియో ద్వారా తెలియజేసింది. స్వాతంత్య్రోద్యమ కాలంలో అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యమకారుల్లో ఉత్సాహాన్ని నింపిన ఓ మహిళ కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఉషా మెహతా జీవిత కథ నుంచి స్ఫూర్తి పొంది ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తున్నది. ‘స్వాతంత్య్ర పోరాటంలో రేడియో కీలక పాత్ర పోషించిందని, అలాంటి ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్ర స్ట్రీమింగ్‌ను ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా మార్చి 21న ప్రారంభిస్తుండటం సంతోషంగా ఉందని కరణ్ జోహార్ ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్ సంస్థ పేర్కొంది.