భారతీయ సినిమాలో ‘కాంతార’ ఓ సంచలనం అని చెప్పొచ్చు. ఈ కన్నడ డివోషనల్ థ్రిల్లర్‌కు దేశవ్యాప్తంగా ఆదరణ దక్కింది. కన్నడంలో మధ్యస్థాయి హీరోగా గుర్తింపు ఉన్న చిత్ర హీరో, దర్శకుడు రిషబ్‌శెట్టి ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా పాపులర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ‘కాంతార’కు సీక్వెల్‌గా రాబోతున్న ‘కాంతార-చాప్టర్ 1’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. దసరా పర్వదినం సందర్భంగా అక్టోబర్ 2న భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా.. ఇప్పటివరకు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయలేదు. దీంతో ట్రైలర్ ఎప్పుడంటూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాపై కావాల్సినంత హైప్ క్రియేట్ అయింది కాబట్టి మేకర్స్ ప్రచార కార్యక్రమాల్ని అంతగా పట్టించుకోవడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 22న ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. మూడవ శతాబ్దంలో కదంబ వంశ పరిపాలనా కాలంలో ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు.
అప్పటి అరణ్యాల్లో దైవాంశ మూర్తీభవించిన భూతకోల ఆవిర్భావం, తదనంతర ఉత్కంఠభరిత పరిణామాలతో ఈ కథను హై ఇంటెన్సిటీ డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారని సమాచారం. ముఖ్యంగా ైక్లెమాక్స్ ఘట్టాల్ని దాదాపు 500 మంది ఫైటర్లు, వారికి సహాయకులు 3000 మంది పాల్గొనగా భారీ స్థాయిలో తెరకెక్కించారని, భారతీయ సినీ చరిత్రలో ఇదొక రికార్డని చెబుతున్నారు. హోంబలే ఫిల్మ్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తెరకెక్కించింది.