Kantara Chapter 1 | రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమా గాంధీ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం, గతంలో వచ్చిన ‘కాంతారకి ప్రీక్వెల్‌గా రూపొందింది. కాంతార చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ప్రీక్వెల్ కూడా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘కాంతార చాప్టర్ 1’ వరల్డ్ వైడ్‌గా దాదాపు ₹440 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో, తెలుగు థియేట్రికల్ రైట్స్ నైజాం: ₹40 కోట్లు, ఆంధ్ర: ₹45 కోట్లు, సీడెడ్: ₹15 కోట్లు బిజినెస్ జరిగినట్టు సమాచారం.
ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ఆధారంగా, తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ₹101 కోట్ల షేర్ లేదా ₹202 కోట్ల గ్రాస్ అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సినిమాకు వరల్డ్ వైడ్‌గా పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ₹43.87 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక మూవీ తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. హిందీ: ₹22 కోట్లు, కర్ణాటక: ₹15 కోట్లు, తమిళం & మలయాళం: ₹6 కోట్లు, ఓవర్సీస్: ₹10 కోట్లు.. మొత్తంగా డే1 గ్రాస్: దాదాపు ₹90 కోట్లు (అంచనా) . తెలుగులో కాంతారకు మంచి ఆదరణ లభించింది. పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి ఆంధ్ర & నైజాంలలో ₹12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. వీకెండ్లో ఇంకా ఎక్కువ వసూళ్లు నమోదయ్యే అవకాశం
ఈ చిత్రంలో రిషబ్ శెట్టికి జోడీగా రుక్మిణి వసంత్ నటించగా, జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఓవర్సీస్లో కూడా కాంతార చాప్టర్ 1 చిత్రం సరికొత్త రికార్డులు సృష్టించింది. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్‌తో కలిపి 750k (భారత కరెన్సీలో 6 కోట్ల రూపాయలు) రాబట్టినట్టు సమాచారం.. ఇక న్యూజిలాండ్, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలో కాంతార చాప్టర్ 1కు 3 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా కాంతారకు ఓవర్సీస్లో తొలి రోజు 10 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని అంటున్నారు.