Kannappa | టాలీవుడ్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు (Mohanbabu) అండ్ విష్ణు (Manchu Vishnu) కాంపౌండ్ నుంచి ఇప్పటికే భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు కన్నప్ప (Kannappa) వస్తున్న విషయం తెలిసిందే. మంచు వారి అభిమానుల కోసం ఏదో ఒక అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇప్పటికే యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ విష్ణు మంచు పుట్టిన రోజు (నవంబర్ 23)ను పురస్కరించుకొని మేకర్స్ స్పెషల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారని అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే న్యూజిలాండ్‌లో మొదలవగా.. ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా 48 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మోహన్ బాబుకు కన్నప్ప టీం శుభాకాంక్షలు తెలియజేసింది. పద్మశ్రీ డాక్టర్ ఎం మోహన్‌బాబు తెలుగు సినీ పరిశ్రమలో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. మొదట విలన్‌గా కెరీర్ మొదలుపెట్టిన మోహన్‌బాబు తన 48 ఏండ్ల ప్రయాణంలో హీరోగా సూపర్ హిట్ సినిమాలు అందించి కలెక్షన్ కింగ్‌గా ఓ వెలుగు వెలిగారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనైనా, హీరోగానైనా తనదైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకోవడం మోహన్‌బాబు స్పెషాలిటి.
విష్ణు మంచు టైటిల్ రోల్లో నటిస్తున్న కన్నప్పలో మోహన్‌బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, Ava Entertainment బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. మొత్తానికి ఈ సారి పాన్ ఇండియా మార్కెట్‌పై పాగా వేయాలని గట్టిగా ఫిక్సయినట్టు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్తో అర్థమవుతోంది.
Team #Kannappa🏹 extends Heartfelt Wishes to the Iconic Legendary Actor and Producer ‘Padmashri’ Dr. M. Mohan Babu Garu as he completes an astounding 48 Years in the Telugu film industry.@themohanbabu #MB48 #MohanBabu #CollectionKing #DialogueKing #Telugufilmindustry pic.twitter.com/YmPkrOqGb1
— BA Raju’s Team (@baraju_SuperHit) November 22, 2023
Two superstars, the legends ‘Pedarayudu’, Mohan Babu Sir and Sharath Kumar Sir, unite for ‘Kannappa’ in New Zealand. Adding their immense star power to this highly anticipated Indian cinematic extravaganza. Get ready for a legendary tale of devotion and grandeur! 🌟🏹… pic.twitter.com/0wJhgECRrV
— BA Raju’s Team (@baraju_SuperHit) November 9, 2023
Mission. Vision. Passion.
🎬Kannappa: Vishnu Manchu’s Dreams to Reality.Dream Project #Kannappa begins #ATrueIndianEpicTale
“Pooja Ceremony”@themohanbabu @iVishnumanchu @mukeshvachan pic.twitter.com/ItB0N2Q4aP
— Kannappa The Movie (@kannappamovie) September 1, 2023