Bhairavana Kone Paata | ‘సప్త సాగరాలు దాటి సైడ్-ఏ’ (Sapta Sagaralu Dhaati), ‘సప్త సాగరాలు దాటి సైడ్-బీ’ (Side-B) సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు కన్నడ దర్శకుడు హేమంత్ రావు. అయితే ఈ సినిమా అనంతరం కన్నడ చక్రవర్తి, స్టార్ నటుడు శివరాజ్ కుమార్‌తో హేమంత్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలను హేమంత్ రావు నిజం చేస్తూ.. శివరాజ్ కుమార్‌తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాకు భైరవనకొనే పాటా (BhairavanaKonePaaTa). అనే టైటిల్‌ను అనౌన్స్ చేశాడు దర్శకుడు హేమంత్ రావు.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ గమనిస్తే.. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రానుండగా.. శివరాజ్ కుమార్ యోధుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను వైశాక్ జే ఫిలి బ్యానర్‌పై వైశాక్ జే గౌడ నిర్మిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఇక హేమంత్ రావు సినిమాల విషయానికి వస్తే.. గోధి బన్న సాధారణ మైకట్టు(Godhi Banna sadharana Maikattu), కవలుదారి Kavaludhari (తెలుగులో కపటధారి), భీమ సేన నల మహారాజు (Bheema Sena Nala Maharaju), సప్త సాగరాలు దాటి (Sapta Sagaralu Dhaati) వంటి చిత్రాలు కన్నడలో బ్లాక్ బస్టర్లు అందుకున్నాయి.
Bhairava is here!!! #Shivanna ❤️#BhairavanaKonePaaTa #BKP #VJFilms pic.twitter.com/7EJGCSiSJf
— Hemanth M Rao (@hemanthrao11) July 8, 2024