గతేడాది చిరంజీవి సర్జా.. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్.. కన్నడ సినిమాకు చీకటి రోజులు

Puneeth raj kumar | కన్నడ సినిమాకు చీకటి రోజులు నడుస్తున్నాయి. కుర్ర హీరోలు అకస్మాత్తుగా కన్నుమూస్తున్నారు. వాళ్ల మరణాన్ని తట్టుకోలేక గుండెలవిసేలా ఏడుస్తున్నారు కుటుంబ సభ్యులు, అభిమానులు. తాజాగా పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన విషయం తెలుసుకుని యావత్ కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు, తమిళ ప్రేక్షకులు అయ్యో పాపం అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈయనకు అన్ని భాషల్లో గుర్తింపు ఉంది. ఇప్పుడిప్పుడే ఇతర భాషల్లో కూడా అభిమానులను సంపాదించుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన హఠాన్మరణం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎప్పుడూ ఆరోగ్యంగా కనిపించే పునీత్ రాజ్‌కుమార్ కేవలం 46 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించడం అనేది ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. ఫిట్నెస్ విషయంలో అంత జాగ్రత్తగా ఉండే పునీత్ కు గుండెపోటు రావడం ఏంటి అని అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎన్నో వేల మందికి సహాయం చేసి దేవుడిలా.. అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న పునీత్ ఇంత త్వరగా వెళ్లిపోతాడు అని ఎవరూ అనుకోలేదు. అందుకే ఆయన మరణవార్త తెలిసిన వెంటనే ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అందరూ సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు.
2020 జూన్ 7న చిరంజీవి సర్జా కూడా కేవలం 35 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న చిరు ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. చనిపోయే సమయానికి ఆయన చేతిలో అరడజను సినిమాలున్నాయి. ఆయన లేడన్న నిజాన్ని కన్నడ ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే మరిచిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఏకంగా పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించడం కన్నడ ఇండస్ట్రీకి తీరని లోటు. ఒక విధంగా చెప్పాలంటే కన్నడ సినిమాకు బ్లాక్ డే ఇది. దాదాపు 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరో ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోవడం అత్యంత దురదృష్టకరం. మళ్లీ ఇంత స్టార్డమ్ ఉన్న హీరో కన్నడ ఇండస్ట్రీకి దొరకాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. దాదాపు 90 శాతం సక్సెస్ రేటు ఉన్న పునీత్.. తాను ఎంచుకునే కథల విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండేవాడు. ఏదేమైనా చిరంజీవి సర్జా మరణం ఇంకా పచ్చిగా ఉండగానే.. ఇప్పుడు కోలుకోలేని దెబ్బ పునీత్ రాజ్ కుమార్ విషయంలో జరిగింది. ఈయన మరణం మరిచిపోవడం అంత సులువు కాదు. ఎందుకంటే కన్నడ ఇండస్ట్రీపై ఆయన వేసిన ముద్ర అలాంటిది. ఈ గాయం మానడానికి కచ్చితంగా కొన్ని ఏళ్లు పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Puneeth Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి
పవర్ స్టార్ పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది మన పూరీ జగన్నాథ్‌నే
పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుకు కారణం అదేనా?
పునీత్ రాజ్ కుమార్ చేసిన తెలుగు రీమేక్స్ ఇవే..
power star | పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్
రియల్ హీరో పునీత్ రాజ్ కుమార్.. ఆయన చేసి సేవల గురించి తెలుసా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

