రుక్మిణి వసంత్
Rukmini Vasanth | ప్రస్తుతం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రుక్మిణి వసంత్.
బెంగుళూరులో జన్మించిన ఈ యంగ్ స్టార్ హీరోయిన్ సింపుల్ లుక్‌తోనే అభిమానుల హృదయాలను దోచుకుంది.
యూత్‌లో క్రేజీ హీరోయిన్గా నిలిచింది. ఈ క్రేజ్‌కి తగ్గట్టేగానే అవకాశాలు క్యూ కడుతున్నాయి.
ప్రస్తుతం, ఆమె చేతిలో మూడు కన్నడ సినిమాలు ఉన్నాయి. ఇందులో కీలక ప్రాజెక్టు కాంతార-ఛాప్టర్ 1 ఒకటి.
ఈ సినిమాలో రుక్మిణి ‘కనకవతి’ పాత్రలో కనిపించనుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవనున్న ఈ చిత్రం మీద భారీ అంచనాలున్నాయి.
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబట్టింది.
రుక్మిణి పోషించిన ‘కనకవతి’ పాత్ర ఎంతో ప్రభావవంతంగా ఉంటుందని, ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుందని టాక్.
ఈ విజయంతో రుక్మిణి కెరీర్ కొత్త మలుపులు తిరుగబోతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో అవకాశాలు దక్కించుకునే అవకాశం ఉందంటున్నారు.
ఇక, ఈ నేపథ్యంలో రుక్మిణి.. తమిళ ఇండస్ట్రీలోనూ వరుస అవకాశాలు వస్తున్నాయి.
ఆమె నటించిన ‘మదరాసి’ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఇది రుక్మిణి నటించిన రెండవ తమిళ చిత్రం.
ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో, శివకార్తికేయన్ సరసన నటిస్తున్న ఈ చిత్రం మీద భారీ అంచనాలున్నాయి.
రుక్మిణి వసంత్ ఈ రెండు భారీ చిత్రాలు ఒక నెల తేడాతో విడుదల కావడంతో.. ఒకే సమయంలో రెండు మార్కెట్ పెంచుకునేందుకు రెడీ అయ్యింది.
ఈ రెండు సినిమాలు హిట్ అయితే, ఆమెకు మరిన్ని అవకాశాలు, డిమాండ్ అంతకన్నా ఎక్కువగా వస్తాయని సినీ విశ్లేషకులు, ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే, ఇక రుక్మిణి తెలుగు మూవీలో నటించనున్నది.
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనుండగా.. ఇందులోనూ హీరోయిన్గా ఎంపికైంది.
త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న మూవీ హిట్ అయితే ఈ అమ్మడు తెలుగులోనూ వరుస ఆఫర్లు దక్కించుకునే అవకాశాలున్నాయి.