Priyanka Upendra | పెళ్లితో నా జీవితం మలుపు తిరిగిందని అనుకున్నా.. ఉపేంద్ర భార్య ప్రియాంక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Priyanka Upendra | ప్రియాంక త్రివేది.. అంటే గుర్తుపట్టేందుకు కొంత సమయం పడుతుందేమో. కానీ,ఉపేంద్ర పేరు జోడించగానే.. బుర్రలో అందమైన రూపం మెరుస్తుంది. అవును, ఈమె హీరో ఉపేంద్ర భార్యే. అప్పట్లో సౌతిండియా స్టార్ హీరోయిన్గా ఉర్రూతలూగించిన ప్రియాంక.. డిటెక్టివ్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించనున్నారు.
Priyanka Upendra | ప్రియాంక త్రివేది.. అంటే గుర్తుపట్టేందుకు కొంత సమయం పడుతుందేమో. కానీ,ఉపేంద్ర పేరు జోడించగానే.. బుర్రలో అందమైన రూపం మెరుస్తుంది. అవును, ఈమె హీరో ఉపేంద్ర భార్యే. అప్పట్లో సౌతిండియా స్టార్ హీరోయిన్గా ఉర్రూతలూగించిన ప్రియాంక.. డిటెక్టివ్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించనున్నారు. ఆమె ముచ్చట్లు ..
నేను బెంగాలీ అమ్మాయినైనా.. పెరిగింది అమెరికా, సింగపూర్లలో. నాటి అభిమానులకు నేనింకా గుర్తున్నాననే అనుకుంటున్నా. మరిచిపోయిన వాళ్లు కూడా.. నన్ను ‘డిటెక్టివ్ తీక్షణ’గా తప్పక గుర్తుపెట్టుకుంటారు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయినా.. ఇది నా 50వ సినిమానే. బెంగాలీలో వెండితెరకు పరిచయమైనా.. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో ఆఫర్లొచ్చాయి.
యా క్షన్, సస్పెన్స్, ఫ్యామిలీ డ్రామాలలో కూడా నటించాను. ఇప్పుడు డిటెక్టివ్ తీక్షణగా రాబోతున్నా. గతంతో పోలిస్తే సినిమా తీసే విధానం పూర్తిగా మారిపోయింది. ట్రెండ్, కథ, ప్రజెంటేషన్ కూడా మారాయి. తెర మీద నాలో కొత్త కోణాన్ని దర్శిస్తారు. గన్ పట్టుకొని సూట్లో సీరియస్‌గా కనిపించే ప్రియాంకను చూస్తారు.
ము ప్పై ఏండ్ల కెరీర్లో ఎక్కడా బ్రేక్ పడకపోవడం గొప్పే. పదహారేండ్లకే మిస్ కలకత్తాగా ఎన్నికయ్యాను. అదే ఏడాది తొలి సినిమా ఛాన్స్ వచ్చింది. 1999-2003 మధ్యలో తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, హిందీ పరిశ్రమల్లో అవకాశాలొచ్చాయి. తొలినాళ్లలోనే.. విజయ్‌కాంత్, విక్రమ్, ప్రభుదేవా, ఉపేంద్రలతో కలిసి నటించాను.
నా జీవితం పెళ్లితో మలుపు తిరిగింది అనుకునేదాన్ని. మా ఆయన, పిల్లలు, ఫ్యామిలీ.. ఇది చాలు అనిపించేది. కానీ, మళ్లీ మళ్లీ అవకాశాలు వచ్చాయి. నేను ససేమిరా అన్నాను. కానీ, మా ఆయన ‘అవకాశం మనవరకు వచ్చినప్పుడు వదులుకోకూడదు’ అని సలహా ఇచ్చారు. ఆ మాటే నన్ను ముందుకు నడిపించింది.
ఇ ప్పటి పరిస్థితుల్లో నన్ను ప్రేక్షకులు తిరిగి ఆమోదిస్తారా అనే టెన్షన్ ఉండేది. కానీ, నా అంచనాలను తలకిందులు చేశారు. ఓటీటీల పుణ్యమాని ఏం కావాలో అదే చూస్తున్నారు. రకరకాల పాత్రల్లో నటించేందుకు ఇప్పుడు చాలా స్కోప్ ఉంది. హీరోయిన్లు వైవిధ్యమైన పాత్రల్ని ఎంచుకుంటున్నారు కూడా.
ఉ పేంద్ర చాలా సినిమాలకు డైరెక్ట్ చేశారు. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం ఇప్పటివరకూ రాలేదు. కానీ, చాలా సినిమాలు కలిసి చూసేవాళ్లం. వాటి గురించి లోతుగా మాట్లాడుకునేవాళ్లం. గంటలకొద్దీ చర్చించుకునేవాళ్లం.ఆయనకు కన్నడ సాహిత్యం అంటే చాలా ఇష్టం.
వెండితెర మీద సూపర్ హీరో పాత్రలు, సినిమాలు ఇప్పటి వరకు ఫెయిల్ కాలేదు. అయితే.. సూపర్ హీరోయిన్ పాత్రలు చాలా తక్కువ. ఇప్పుడు డిటెక్టివ్ తీక్షణలో నేను చేసేది సూపర్ హీరోయిన్ పాత్రే. ఇది ఆడవారికే కాదు.. అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా. సినిమా చూశాక మీ అభిప్రాయం చెప్పండి మరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

