Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం కంగువ (Kanguva) సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. సూర్య 42గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు శివ దర్శకత్వం వహిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కంగువ టైటిల్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ లాంఛ్ చేయగా.. సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. మరోవైపు కంగువ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్టన్నింగ్ అప్డేట్ వచ్చేసింది.
కంగువ ప్రోమో (Kanguva Promo)జులై 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. సర్ప్రైజ్ ప్లాన్.. రెడీగా ఉండండి.. అని అదిరిపోయే న్యూస్ చెప్పారు మేకర్స్. త్వరలోనే ప్రోమో ఉంటుందని తెలియడంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు మూవీ లవర్స్, ఫ్యాన్స్. ఈ మూవీని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ సినిమా 10 భాషల్లో విడుదల కానుంది. కంగువ ౩డీ ఫార్మాట్లో కూడా సందడి చేయనుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నాడు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. 2024 ప్రథమార్థంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ సినిమా ఎలా ఉండబోతుందో స్టోరీలైన్ చెప్పి.. క్యూరియాసిటీ పెంచుతున్నారు గతానికి, ప్రస్తుతకాలానికి మధ్య ఉండే కనెక్షన్‌తో సాగే స్టోరీలైన్ ఆధారంగా కంగువ ఉండబోతుందని ప్రముఖ నిర్మాత ధనంజయన్ (producer Dhananjayan) ఇప్పటికే అప్డేట్ ఇచ్చి అందరిలో జోష్ నింపుతున్నాడు. కంగువ సీక్వెల్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని హింట్ ఇచ్చేస్తూనే…ఈ సినిమా అందరినీ ఇంప్రెస్ చేయడం ఖాయమని చెప్పారు ధనంజయన్.
కంగువ ప్రోమో న్యూస్..
MASSIVE #Kanguva surprise planned for July 23rd. pic.twitter.com/0cscbICZ1B
— Manobala Vijayabalan (@ManobalaV) July 12, 2023
కంగువ టైటిల్ గ్లింప్స్ వీడియో..
A Man with Power of Fire & a saga of a Mighty Valiant Hero.#Suriya42 Titled as #Kanguva In 10 Languages🔥
In Theatres Early 2024Title video 🔗: https://t.co/xRe9PUGAzP@KanguvaTheMovie @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @UV_Creations @kegvraja pic.twitter.com/0uWXDIMCTM
— Studio Green (@StudioGreen2) April 16, 2023