Kanguva | తమిళ అగ్ర కథానాయకుడు సూర్య (Suriya) ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). సిరుత్తై శివ (siva) దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది ఈ చిత్రం. అయితే ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ చాలా ఎక్కువ ఉందని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఆస్కార్ అవార్డు అందుకున్న రసుల్ పుకుట్టి కూడా ఈ సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌పై విమర్శలు చేశాడు. అయితే సౌండ్ విషయంలో వివాదలు వస్తున్న నేపథ్యంలో చిత్రబృందం తాజాగా వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. ఈ సినిమా నుంచి సౌండ్ డెసిబెల్స్ మోతాదును తగ్గించమని కంగువ టీంకి ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా ఆదేశించినట్లు సమాచారం.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రష్యాకు చెందిన కొందరు సైన్సిస్టులు కొందరు పిల్లలను బంధించి, వారిపై ప్రయోగాలు చేస్తుంటారు. వారి నుంచి ఓ పిల్లాడు తప్పించుకోవడంతో ఈ కథ మొదలవుతుంది. తప్పించుకున్న పిల్లాడు ప్రాన్సిస్(సూర్య) దగ్గరకు చేరతాడు. ఆ పిల్లాడెవరో ఫ్రాన్సిస్‌కి తెలీదు. కానీ ఇబ్బందుల్లో ఉన్నాడని అర్థం చేసుకుంటాడు. రష్యన్ దుండగలు ఆ పిల్లాడ్ని వెంబడిస్తుంటారు. ఫ్రాన్సిస్ కాపాడుతుంటాడు. అసలు ఆ పిల్లాడెవరు? ఫ్రాన్సిస్ దగ్గరకే ఎందుకు చేరాడు? ఫ్రాన్సిస్కీ ఈ పిల్లాడికీ ఉన్న సంబంధం ఏంటి? అసలు ‘కంగువ’ అంటే ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మిగతా కథ.