ఈ రోజుల్లో బయోపిక్స్ బాగానే వస్తున్నాయి. అయితే ప్రేక్షకులను అలరించడంలో మాత్రం ఆ సినిమాలు నిరాశ పరుస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఇలాగే జరిగింది. నిజానికి కథానాయకుడు సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశ పరిచింది ఈ చిత్రం. ఇక మహానాయకుడు సంగతి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆ తర్వాత మరికొన్ని బయోపిక్స్ కూడా ఇలాగే నిరాశ పరిచాయి. తాజాగా దివంగత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన తలైవి సినిమా కూడా ఇలాగే నిరాశ పరిచింది. సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా విడుదలైన ఈ చిత్రానికి టాక్ బాగానే వచ్చింది. విజయ్ ఎమోషనల్ రైడ్ గా ఈ సినిమాను తెరకెక్కించాడని అంతా మెచ్చుకుంటున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తలైవి సినిమాను విడుదల చేశారు. అయితే టాక్ బాగానే వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి. తొలిరోజు ఈ చిత్రానికి కనీసం నామ మాత్రపు వసూళ్లు కూడా రాలేదు.
నైజాం: 5 లక్షలు
సీడెడ్: 3 లక్షలు
ఉత్తరాంధ్ర: 3 లక్షలు
ఈస్ట్: 2 లక్షలు
వెస్ట్: లక్ష రూపాయలు
గుంటూరు: 3 లక్షలు
కృష్ణా: 2 లక్షలు
నెల్లూరు: లక్ష రూపాయలు
ఏపీ + తెలంగాణ: 20 లక్షలు
తెలుగు రాష్ట్రాల్లో తలైవి సినిమాను ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. అయినా కూడా ఈ చిత్రం హిట్ అవ్వాలంటే కనీసం 1.50 కోట్ల షేర్ తీసుకురావాలి. అయితే ప్రస్తుతం ఓపెనింగ్ డే నాడు వచ్చిన వసూళ్లు చూసిన తర్వాత అంత తీసుకొస్తుందనే నమ్మకాలు అయితే ఎవరిలోనూ కనిపించడం లేదు. మరోవైపు సీటీమార్ సినిమా మాస్ సెంటర్స్‌లో అల్లాడిస్తుంది. దాంతో అమ్మ బయోపిక్ దీని ముందు నిలబడలేపోయింది. ఏదేమైనా కూడా తలైవి సినిమాకు ఇంత దారుణంగా వసూళ్లు వస్తాయని ఎవరూ అనుకోలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Saidharam Tej | స్పృహలోకి వచ్చిన సాయిధరమ్ తేజ్
sai dharam tej : నా ఇంటి నుంచి వెళ్తుండగానే యాక్సిడెంట్ జరిగింది : నరేశ్
Sai Dharam Tej | అతి వేగం వల్లే సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం : మాదాపూర్ డీసీపీ
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం కోసం పూజలు చేస్తున్న ఆ ఆశ్రమ వాసులు..