Emergency Movie | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency). దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం గతేడాది నవంబరు 24న విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వలన విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ 14న విడుదల చేయానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ క్రమంలోనే కంగనా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం హిమచల్ ప్రదేశ్ ‘మండి’ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటి చేసి గెలవడంతో రాజకీయల్లో బిజీ అయ్యి ఈ సినిమా మళ్లీ వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమాను సెప్టెంబర్ 06న విడుదల చేయనున్నట్లు కంగనా అనౌన్స్ చేసింది.
విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటుంది కంగనా. అయితే విడుదలకు ఇంకా వారం రోజులు ఉన్న క్రమంలో సెన్సార్ బోర్డ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది కంగనా. ‘ఎమర్జెన్సీ’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఇంకా సర్టిఫికేట్ ఇవ్వట్లేదని తెలిపింది.
”త్వరలోనే మా సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంటుందని ఆశిస్తున్నా. సెన్సార్ బోర్డులో చాలా సమస్యలు ఉన్నాయి. మేము ‘ఎమర్జెన్సీ’ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ కోసం వెళ్లినప్పుడు కొంతమంది వ్యక్తులు డ్రామా క్రియేట్ చేశారు. నేను సెన్సార్ బోర్డ్‌ను నమ్ముతున్న. కానీ వాళ్లు నా సినిమాకు వాళ్లు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. సర్టిఫికేట్ జారీ చేయడంలో ఆలస్యం చేస్తున్నారు. నా సినిమా కోసం నేను పోరాటం చేయడానికి రెడీగా ఉన్నా. అందుకోసం కోర్టు వరకు వెళ్లడానికి అయిన సిద్ధం అంటూ కంగనా చెప్పుకోచ్చింది.
మరోవైపు ఈ సినిమాను తెలంగాణలో నిషేధం విధించే అవకాశాలున్నాయన్న వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఎమర్జెన్సీ సినిమా రిలీజ్‌పై ప్రభుత్వం న్యాయపరమైన సంప్రదింపులు జరుపుతూ.. నిషేధం అంశాన్ని పరీలిస్తుందని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. మాజీ ఐపీఎస్ అధికారి తేజ్ దీప్ కౌర్ మీనన్ నేతృత్వంలోని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధుల బృందం షబ్బీర్‌ను కలిసి ఎమర్జెన్సీ విడుదలపై నిషేధం విధించాలని కోరింది. సిక్కు సొసైటీ ప్రతినిధులు సినిమాలో సిక్కు సమాజాన్ని చూపించిన తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. రాష్ట్రంలో సినిమాను నిషేధించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డిని షబ్బీర్ కోరినట్టు సమాచారం.