Kamal R Khan | బాలీవుడ్ నటుడు కేఆర్‌కు బెయిల్.. అయినా జైలులోనే..!
Kamal R Khan | బాలీవుడ్ నటుడు, నిర్మాత కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్కేకు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వేధింపుల కేసులో గత నెలలో ఆయనను పోలీసులు ముంబై ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కోర్టు బెయిల్ మంజూరు చేసినా కేఆర్కే జైలులోనే ఉండనున్నాడు. అక్షయ్ కుమార్, నిర్మాత రాంగోపాల్‌వర్మతో పాటు పలువురిని విమర్శిస్తూ ట్వీట్లు చేయగా.. ఈ కేసులో బెయిల్ దొరకలేదు. 2020లో నమోదైన కేసులో కేఆర్కే బెయిల్ పిటిషన్‌పై ఇవాళ బోరివలి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.
కేఆర్కే గతంలో చేసిన ట్వీట్లపై ఎఫ్ఐఆర్ నమోదవగా.. ఆగస్టు 30న అరెస్టు పోలీసులు అరెస్టు చేయగా.. బోరవలి కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. వెర్సోవా పోలీసులు కేఆర్కేను వేధింపుల కేసులో అదుపులోకి తీసుకొని బాంద్రా కోర్టులో హాజరుపరిచారు. ఎఫ్ఐఆర్లోని అంశాలు ఆచరణాత్మకంగా వేధింపుల ఘటనతో సరిపోలడం లేదని కోర్టు దృష్టికి కేఆర్కే లాయర్ పేర్కొన్నారు. ఘటన జరిగిన 18 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైందని, బాధితురాలి స్నేహితురాలు చెప్పిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదైందని, బెయిల్ ఇవ్వాలని కోరాగా.. కోర్టు బెయిల్ ఇచ్చింది. 2021, జూన్‌లో 27 సంవత్సరాల మహిళ చేసిన ఫిర్యాదు మేరకు కేఆర్కేపై వేధింపుల కేసు నమోదైంది. సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి వెర్సోవాలోని బంగ్లాకు పిలిచాడని ఆరోపించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

