kamal Hassan | తన సినిమాకు తానే కథ సిద్ధం చేసుకున్న కమల్ హాసన్..
ప్రముఖ కథానాయకుడు కమల్‌హాసన్ తాజాగా హెచ్.వినోద్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి స్వయంగా కమల్‌హాసన్ కథను అందించడం విశేషం. రాజ్‌కమల్ ఫిలింస్ ఇండియా నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
ప్రముఖ కథానాయకుడు కమల్‌హాసన్ తాజాగా హెచ్.వినోద్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి స్వయంగా కమల్‌హాసన్ కథను అందించడం విశేషం. రాజ్‌కమల్ ఫిలింస్ ఇండియా నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం గురించి కమల్‌హాసన్ మాట్లాడుతూ ‘ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో ఎన్నో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త ప్రతిభని స్వీకరించడం, ఉన్నత వినోద విలువలతో నాణ్యమైన చిత్రాలను రూపొందించడానికి సహకరించడం అత్యవసరం.
నేను నా అనుభవాన్ని పంచుకోవడానికి అలాగే కొత్త విషయాలను తెలుసుకోవడానికి రాబోయే తరానికి చెందిన ప్రతిభావంతులతో పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను. వినోద్ సృజనాత్మకత,కంటెంట్ పట్ల నిబద్ధత కలిగి వున్న దర్శకుడు. సామాజిక ప్రాధాన్యతతో కూడిన కథలకు కమర్షియల్ అంశాలు జోడించి సక్సెస్ఫుల్ సినిమాలు తీస్తారనే పేరు వుంది. ఆర్‌కెఎఫ్‌ఐ 52 కూడా ఇలాంటి కలయికలోనే వుంది. ఈ చిత్రానికి కథ అందిస్తున్నందుకు చాలా ఎక్సయిటెడ్గా వున్నాను’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

