లోకనాయకుడు కమల్ హాసన్ తెలియని సినీ ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు.భారతదేశంలో పుట్టిన ఆస్కార్ స్థాయి నటుడు కమల్. ఆయన చేసినన్ని ప్రయోగాలు ఎవరు చేసి ఉండరు. ‘స్వాతిముత్యం’, ‘సాగర సంగమం’, ‘ఇంద్రుడు చంద్రుడు’, ‘శుభ సంకల్పం’.. తెలుగులో ఆయన చేసిన కొన్ని ఆణిముత్యాల్లాంటి సినిమాలు. ఇవి చాలు.. నటుడిగా ఆయన స్టామినా ఏమిటో చెప్పడానికి.
‘కలత్తూర్ కన్నమ్మ’ అనే సినిమాతో బాలనటుడిగా ప్రారంభమైన కమల్ సినీ ప్రస్థానం….నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం తమిళ బిగ్బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే.. మాస్టర్ ఫేమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ అనే సినిమా చేస్తున్నారు.. కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి మరియు మలయాళం స్టార్ నటుడు ఫాహద్ ఫాసిల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
కమల్ హాసన్, ఫాహాద్ ఫాసిల్ మరియు విజయ్ సేతుపతిని ఒకేసారి వెండితెర చూసేందుకు అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే మూవీ బృందం కమల్ బర్త్ డే వేడుకలను నిర్వహించారు.ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
#KHBirthdayCelebrations Begins
— BA Raju's Team (@baraju_SuperHit) November 1, 2021
Team #VIKRAM 🔥 Grandly
Kick-Started the Advance Birthday Celebrations of
‘Ulaganayagan’ @ikamalhaasan #KamalHaasan @VijaySethuOffl #FahadFasil @Dir_Lokesh @anirudhofficial @RKFI pic.twitter.com/pGmlRohpVy