Thug life Trailer | తమిళ విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతుండగా.. ఈ చిత్రానికి లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. సిలంబరసన్ టి.ఆర్., త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, అభిరామి మరియు నాజర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 05న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్ చూస్తుంటే గ్యాంగ్స్టర్ డ్రామా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. నాయకుడు తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.