vikram Trailer | ‘విక్రమ్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. విడుదల ఎప్పుడంటే?
vikram Trailer | లోకనాయకుడు కమల్‌హాసన్ ఆరు పదుల వయసు దాటినా యువ హీరోలకు ధీటుగా యాక్షన్ సినిమాలను చేస్తున్నాడు. ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. ‘మాస్టర్’ ఫేం లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. గతేడాది విడుదలైన టైటిల్ టీజర్ నుంచి ఇటీవలే విడుదలైన మేకింగ్ గ్లింప్స్ వరకు ప్రతి ఒక్కటి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గతకొంత కాలంగా కమల్ నుంచి ఆశించిన స్థాయిలో ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ క్రమంలో ‘విక్రమ్’ చిత్రం మళ్ళీ అప్పటి కమల్‌ను గుర్తుచేస్తుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 3న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ తరచూ ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా చిత్ర బృందం మరో అప్డేట్ను ప్రకటించారు.
‘విక్రమ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మే15న చెన్నైలో జరగనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా అదే రోజున ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలోని ‘పథాల పథాల’ ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో మే11న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై ప్రేక్షకులలో మొదటి నుంచి భారీ స్థాయిలో అంచనాలను నెలకొన్నాయి. ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలు ఈ చిత్రంలో నటించనుడంటంతో ప్రేక్షకులలోనే కాదు సినీప్రముఖులలో కూడా అంచనాలు రెట్టింపు అయ్యాయి. కమల్ హసన్‌కు 232 సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలింస్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి కమల్ హాసన్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
#KamalHaasan #VikramFromJune3 #VikramAudioLaunch #VikramTrailer@ikamalhaasan @Udhaystalin @Dir_Lokesh @anirudhofficial @VijaySethuOffl #FahadhFaasil #Mahendran @RKFI @turmericmediaTM @SonyMusicSouth @RedGiantMovies_ @DisneyPlusHS @vijaytelevision @disneyplusHSTam https://t.co/Vstu14TaBd
— Raaj Kamal Films International (@RKFI) May 10, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

