Kamal haasan | విశ్వనటుడు కమల్ హాసన్ నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది. ట్రెండ్‌కు తగ్గట్టుగా కథలను ఎంచుకుంటూ యువ హీరోలకు ధీటుగా సినిమాలను చేస్తుంటాడు.ప్రస్తుతం ఈయన నటించిన విక్రమ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘మాస్టర్’ ఫేం లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రంపై మొదటి నుంచి ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత కమల్ నెక్స్ట్ సినిమా ఏంటి అనేది ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.
‘రాయుడు’ ఫేం ముత్తయ్యతో కమల్ నెక్స్ట్ సినిమాను చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ అఫిషియల్‌గా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ‘విక్రమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ దర్శకుడు పా. రంజిత్, కమల్‌తో తన తదుపరి సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించాడు. ముధురై బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు.. కమల్ నటించిన వీరుమండి (పోతురాజు) సినిమా తరహాలో ఈ చిత్రం ఉండనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కబాలి, కాలా, సార్పట్ట పరంపర వంటి సినిమాలను తెరకెక్కించన పా.రంజీత్, కమల్‌తో నెక్స్ట్ సినిమా చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది.