Indian 2 | కొన్ని రోజులుగా సరైన విజయాలు లేక ఇబ్బందిపడ్డారు కమల్‌హాసన్. అయితే.. ప్రస్తుతం ఆయన టైమ్ నడుస్తున్నది. కమల్ ‘విక్రమ్’ సినిమా ఆరువందలకోట్ల వసూళ్లను రాబట్టి, ఆయన కెరీర్లోనే భారీ విజయంగా నిలిచింది. ఈ నెల 27న ‘కల్కి 2898’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు కమల్. ఇందులో ఆయన సుప్రీం యాస్కిన్‌గా ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా వేడి చల్లారకముందే.. ‘ఇండియన్ 2’ని కూడా సిద్ధం చేసేశారు కమల్‌హాసన్.
వచ్చేనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా తెలుగునాట భారతీయుడు2’ పేరిట రిలీజ్ కానుంది. ఇదిలావుంటే.. ఈ సినిమా గురించి ఓ తాజా వార్త వినిపిస్తున్నది. స్వతహాగా శంకర్ సినిమాలు కాస్త నిడివి ఎక్కువగా ఉంటాయి. ‘ఇండియన్ 2’ నిడివి ఇంకాస్త ఎక్కువని తెలుస్తున్నది. ఏకంగా 3 గంటల 10 నిమిషాల నిడివి వచ్చిందట ఈ సినిమా. అంతేకాదు, ‘ఇండియన్2’కు సెన్సార్‌వారు ఏ సర్టిఫికెట్ ఇచ్చారట. ఇప్పటికే ఓవర్సీస్లో బుకింగ్స్ మొదలయ్యాయి. అక్కడ్నుంచి వచ్చిన సమాచారమే ఇది. కమల్, మణిరత్నం కాంబినేషన్లో ‘థగ్‌లైఫ్’ అనే సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే.