నేతాజీ మార్గంలో నేను..
కమల్‌హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భారతీయుడు-2’. శంకర్ దర్శకుడు. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
కమల్‌హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భారతీయుడు-2’. శంకర్ దర్శకుడు. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. సిద్ధార్థ్ చెప్పే డైలాగ్స్‌తో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది. వ్యవస్థలోని అవినీతిని అరికట్టడానికి సేనాపతి తిరిగి రావాల్సిందేనని ప్రజలు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో సేనాపతి ఎంట్రీ ఇస్తాడు. సేనాపతిగా కమల్‌హాసన్ విభిన్న గెటప్స్‌లో కనిపించారు. యాక్షన్, విజువల్స్ హైలైట్‌గా నిలిచాయి.
‘ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు..నేతాజీ మార్గంలో నేను. ఇక ఆట ఆరంభమైంది’ అంటూ సేనాపతి చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సీక్వెల్లో స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతి పాత్రలో కమల్‌హాసన్ కనిపించనున్నారు. ఎస్.జె.సూర్య, సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా భవానీశంకర్, నెడుముడి వేణు, వివేక్, కాళిదాస్, జయరాం, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, బాబీ సింహా, బ్రహ్మానందం, జాకీర్ హుస్సేన్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: రవివర్మన్, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ ప్రొడక్షన్స్, నిర్మాత: సుభాస్కరన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

