విఖ్యాత నటుడు కమల్‌హాసన్ మరో ఎక్సయింటింగ్ ప్రాజెక్ట్‌ని ప్రకటించారు. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బు, మణి, అరివు మణి(అన్బరివ్)లను దర్శకులుగా పరిచయం చేస్తూ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్‌హాసన్, మహేంద్రన్ కలిసి ‘KHAA’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘హంట్ మోడ్ ఆన్’ అనేది ఉపశీర్షిక.
‘విక్రమ్’ సినిమాలో అద్భుతమైన స్టంట్ కొరియోగ్రఫీతో ప్రేక్షకుల మదిలో అన్బరీవ్ చెరగని ముద్ర వేశారని, దర్శకులుగా వారి కొత్త ప్రయాణం మొదలవ్వబోతున్నదని, కమల్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా ఐకానిక్ స్థాయిలో భారీ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందనున్నదని మేకర్స్ తెలిపారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు కెమెరా: సునీల్ కేఎస్, సంగీతం: జేక్స్ బిజోయ్.