సూపర్‌హీరో థ్రిల్లర్ ‘లోహ్’ (తెలుగులో ‘కొత్తలోక’) చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది మలయాళీ సోయగం కళ్యాణి ప్రియదర్శన్. ఈ సినిమాలో మానవరూపంలో ఉన్న యక్షిణి పాత్రలో ఆమె అభినయానికి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో కల్యాణి ప్రియదర్శన్ నటిస్తున్న తాజా తమిళ చిత్రం ఇటీవలే చెన్నైలో ప్రారంభమైంది. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కెంచబోతున్నారు. దేవదర్శిని, వినోద్ కిషన్ కీలక పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి ధీరవియం ఎస్.ఎస్.దర్శకత్వం వహిస్తారు.
కల్యాణి ప్రియదర్శన్ నటిస్తున్న తొలి తమిళ లేడీఓరియెంటెడ్ చిత్రమిదని, ఇందులో ఆమె కల్కి అనే మధ్యతరగతి అమ్మాయిగా కనిపిస్తుందని, అమె పాత్రతో ప్రతీ ఒక్కరు కనెక్ట్ అవుతారని మేకర్స్ తెలిపారు. కల్యాణి ప్రియదర్శన్ సోలో లీడ్రోల్లో నటిస్తున్న తొలి తమిళ చిత్రమిదే కావడం విశేషం. ‘కొత్తలోక’ సక్సెస్‌తో పలువురు దర్శకులు లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌లతో ఈ భామను సంప్రదిస్తున్నారట. అయితే ఎలాంటి పాత్ర చేసినా కొత్తదనానికే తన ప్రాధాన్యత అని, ‘కొత్త లోక’ సక్సెస్‌తో కథాంశాల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటున్నానని కల్యాణి ప్రియదర్శన్ పేర్కొంది.