Antony Movie | హలో (Hello) సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్గా మెరిసింది పాపులర్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan). ఆ తర్వాత తెలుగులో చిత్రలహరి (Chitralahari), రణరంగం (Ranarangam) సినిమాలతో పాటు మలయాళంలో బ్రో డాడీ (Bro Daddy), తల్లుమల్ల (Thallumalla), హృదయం (Hrudayam) చిత్రాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ భామ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆంటోని'(Antony). జోజు జార్జ్ (Joju George)ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బీజీగా ఉన్న ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తోపాటు మోషన్ పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
టీజర్ గమనిస్తే.. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ బాక్సింగ్ ప్లేయర్‌గా కనిపించబోతుంది. ఐన్‌స్టీన్ మీడియా, నెక్స్టెల్ స్టూడియోస్, అల్ట్రా మీడియా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. జోషి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.
జోజు జార్జ్, కళ్యాణి ప్రియదర్శన్, సెంబన్ వినోద్ జోస్, నైలా ఉష వంటి ప్రధాన తారాగణంతో పాటు విజయరాఘవన్, ఆశా శరత్, జిను జోసెఫ్, హరిప్రశాంత్, అప్పాని శరత్, బిను పప్పు, సుధీర్ రమణ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.