శేఖర్ అయాన్ వర్మ, వైభవి రావ్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘కళ్యాణమస్తు’. ఒ.సాయి దర్శకుడు. బోయపాటి రఘుబాబు నిర్మాత. మే 12న చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలోని ‘నీ జతలో నీడల్లే ఉండనా కడదాకా’ అనే లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం.
దర్శకుడు మాట్లాడుతూ ‘నేటి యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులను అలరించే భావోద్వేగాలతో ఈ చిత్రం ఉంటుంది’ అన్నారు.