Kalyan Ram Next Movie | రిజల్ట్ సంగతి పక్కన పెట్టేస్తే.. కళ్యాణ్ రామ్ ఎప్పుడూ వినూత్న కథలకు పెద్ద పీఠ వేస్తుంటాడు. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడేడు సరికొత్త థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు తాపత్రపడుతుంటాడు. ఈ క్రమంలోనే డిఫెరెంట్ సినిమా చేస్తూ తనకంటూ ఓ యూనిక్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఎన్నో ఏళ్ల తర్వాత బింబిసారతో మాస్సీవ్ కంబ్యాక్ ఇచ్చిన కళ్యాణ్‌రామ్ అదే ఊపును అమిగోస్‌తో కంటిన్యూ చేయలేకపోయాడు. కమర్షియల్‌గా ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా.. కళ్యాణ్ రామ్ స్క్రిప్ట్ సెలక్షన్‌ను, ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఈ నటుడు డెవిల్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ ఓ రేంజ్లో ఆకట్టుకుంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ ఓ హార్రర్ కన్సెప్ట్ సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసాయట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇక ఈ సినిమాలో హార్రర్‌ను మాములుగా చూపించరని ఇన్సైడ్ టాక్. సినిమా చూస్తిన్నంత సేపే వణికి పోతామని, భయం కట్టలు తెంచుకోని వస్తుందని సమాచారం. ఇక ఈ సినిమా దర్శకుడు, నటీనటులు ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు.
ఇక అమిగోస్‌తో దెబ్బ కొట్టించుకున్న కళ్యాణ్‌రామ్ డెవిల్తో ఎట్టి పరిస్థుతుల్లో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్లా కనిపించబోతున్నాడు. నవంబర్ 24న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు.