Devara 2 – Kalyan Ram | టాలీవుడ్ అగ్ర కథానాయకడు ఎన్టీఆర్ గత ఏడాది ‘దేవర’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. అయితే ఈ సినిమా సక్సెస్‌తో అభిమానులు సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ‘దేవర 2’ గురించి ఇప్పటివరకూ మేకర్స్ నుంచి స్పష్టమైన అప్డేట్ రాలేదు. ఇటీవల ఓ ఈవెంట్లో ఎన్టీఆర్ ‘దేవర 2’ ఖచ్చితంగా ఉంటుందని చెప్పినప్పటికీ, దాని గురించి సరైన అప్డేట్ ఇవ్వలేక పోయాడు.
మరోవైపు ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ బిజీగా ఉంది. ‘వార్ 2’, ‘NTRNeel’, ‘దేవర 2’తో పాటు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌తో ఓ భారీ బడ్జెట్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌లలో ‘వార్ 2’ ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఆ తర్వాత ఏ సినిమా వస్తుందనే దానిపై అభిమానుల్లో సందిగ్ధం నెలకొంది.
ఈ నేపథ్యంలో నటుడు కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ లైనప్‌పై క్లారిటీ ఇచ్చారు. నెల్సన్ సినిమా కంటే ముందే ‘దేవర 2’ సెట్స్‌పైకి వెళ్తుందని స్పష్టం చేశారు. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే ‘దేవర 2’ షూటింగ్ మొదలవుతుందని తెలిపారు. దీంతో 2026లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ‘దేవర 2’ కోసం కొన్ని సీన్స్ షూట్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా 2026లో పూర్తయి, 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాతే నెల్సన్ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది.
మరోవైపు, ‘వార్ 2’ షూటింగ్ దాదాపు పూర్తవగా, ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టాడు. ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్లో ఆయన పాల్గొంటారు. మేకర్స్ ఈ సినిమాను 2026 జనవరిలో రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘దేవర 2’ షెడ్యూల్‌పై కల్యాణ్ రామ్ ఇచ్చిన అప్డేట్తో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సీక్వెల్ కోసం వారు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.