Amigos Movie Teaser | ‘బింబిసార’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ‘అమిగోస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నందమూరి కళ్యాణ్‌రామ్. ప్రయోగాత్మక సినిమాలకు పెద్ద పీట వేసే నటులలో కళ్యాణ్‌రామ్ ఒకడు. కెరీర్ బిగెనింగ్ నుండి వినూత్న సినిమాలు తీస్తూ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన అమిగోస్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయంలో నటిస్తున్నాడు. ఇటీవలే రిలీజైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా టీజర్ అప్డేట్ను చిత్రబృందం ప్రకటించింది. అమిగోస్ టీజర్‌ను ఆదివారం ఉదయం 11:07 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌కు జోడీగా అశికా రంగనాథ్ నటిస్తుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా సంక్రాంతి తర్వాత ఈ సినిమా ప్రమోషన్లను భారీ స్థాయిలో జరుపాలని మైత్రీ సంస్థ ప్లాన్ చేస్తుంది.
3 Doppelgangers 😎
3 different lives ❤️
1 interesting confrontation 💥#Amigos Teaser tomorrow at 11.07 AM 💥In cinemas on Feb 10, 2023 🔥@NANDAMURIKALYAN @AshikaRanganath #RajendraReddy @GhibranOfficial @saregamasouth pic.twitter.com/RPFAfJoxAR
— Mythri Movie Makers (@MythriOfficial) January 7, 2023