కల్యాణ్‌రామ్ మెరుపు?
హీరో కల్యాణ్‌రామ్ త్వరలో ‘మెరుపు’లా రానున్నారా? అంటే ఫిల్మ్ వర్గాలు అవుననే అంటున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రానికి ‘మెరుపు’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తున్నది.
హీరో కల్యాణ్‌రామ్ త్వరలో ‘మెరుపు’లా రానున్నారా? అంటే ఫిల్మ్ వర్గాలు అవుననే అంటున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రానికి ‘మెరుపు’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తున్నది. గతంలో రామ్‌చరణ్ హీరోగా ధరణి దర్శకత్వంలో మొదలైన ఓ చిత్రానికి ఇదే టైటిల్ అనుకున్నారు. అయితే.. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
తర్వాత కూడా ఎవరూ ఆ టైటిల్‌తో సినిమా చేయలేదు. ఇన్నాళ్లకు కల్యాణ్‌రామ్‌కు ఆ టైటిల్ కుదిరింది. ముప్పా వెంకయ్య చౌదరి, ముప్పా అశోక్ వర్ధన్, సునీల్ బులుసు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ కథానాయిక. మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మళ్లీ విజయశాంతి ఇందులో నటిస్తున్నారు. ఇందులో ఆమె వైజయంతీ ఐపీఎస్‌గా పోలీస్ అధికారి పాత్ర పోషిస్తుండటం విశేషం. భారీ విరామం తర్వాత విజయశాంతిని మళ్లీ పోలీస్ డ్రెస్‌లో చూడబోతున్నామన్నమాట. కల్యాణ్‌రామ్ పాత్ర కూడా ఇందులో పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నదట. కార్పొరేట్ లుక్‌తో ైస్టెల్‌గా ఆయన ఇందులో కనిపించనున్నారని మేకర్స్ చెబుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kalyan ram
- MERUPU
- NKR21
- ram charan
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

