NKR21 | కల్యాణ్‌రామ్ పంచ్ అదిరింది.. స్టన్నింగ్‌గా NKR21 గ్లింప్స్
NKR21 | గతేడాది NKR21 (వర్కింగ్ టైటిల్)తో కొత్త సినిమా ప్రకటించాడు నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram). ప్రదీప్ చిలుకూరి డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న ఈ చిత్రం యాక్షన్ జోనర్లో వస్తోంది.
NKR21 | బింబిసారతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. గతేడాది NKR21 (వర్కింగ్ టైటిల్)తో కల్యాణ్‌రామ్ కొత్త సినిమా ప్రకటించాడు. NKR21 సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ షేర్ చేయగా.. పిడికిలి బిగించి ఉన్న కల్యాణ్ రామ్ చేతిపై రక్తపు మరకలున్న లుక్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. ప్రదీప్ చిలుకూరి డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న ఈ చిత్రం యాక్షన్ జోనర్లో వస్తోంది.
టీడీపీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR) 101వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ.. NKR21 గ్లింప్స్‌ను షేర్ చేసింది కల్యాణ్ రామ్ టీం. షూటింగ్ స్పాట్ విజువల్స్తోపాటు అదిరిపోయే పంచ్‌తో కట్ చేసిన వీడియో నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. అలా ఎలా సినిమా తర్వాత అశోక క్రియేషన్స్ బ్యానర్లో వస్తోన్న రెండో సినిమా ఇది.
అశోక్ వర్ధన్ ముప్ప, సునిల్ బలుసు, ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కల్యాణ్‌రామ్ ఇప్పటికే డెవిల్ సినిమాలో నటిస్తున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్న డెవిల్ గ్లింప్స్ , ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. పీరియాడిక్ స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న డెవిల్ గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. డెవిల్ షూటింగ్ పూర్తి చేసుకోగా.. విడుదల ఎప్పుడనేది తెలియాల్సి ఉంది.
ఈ చిత్రాన్ని దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. డెవిల్కు శ్రీకాంత్ విస్సా (Srikanth Vissa) కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.
NKR21 గ్లింప్స్..
‘𝐓𝐇𝐄 𝐅𝐈𝐒𝐓 𝐎𝐅 𝐅𝐋𝐀𝐌𝐄’ from #NKR21
Shoot in progress.#JoharNTR
@vijayashanthi_m garu @saieemmanjrekar @PradeepChalre10 @SunilBalusu1981 #AshokMuppa @AJANEESHB @harie512 @NTRArtsOfficial @AshokaCOfficial— BA Raju’s Team (@baraju_SuperHit) May 28, 2024
NKR21 లుక్..
The FIST of FURY 🔥👊🔥@NANDAMURIKALYAN in an action-packed powerful role ❤️🔥#NKR21 shoot begins soon 🔥#HappyBirthdayNKR @PradeepChalre10 #AshokaMuppa @SunilBalusu1981 @harie512 @AshokaCOfficial pic.twitter.com/qb9S2TwCee
— NTR Arts (@NTRArtsOfficial) July 5, 2023
డెవిల్ గ్లింప్స్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

