NKR21 | కల్యాణ్‌రామ్ బర్త్ డే స్పెషల్.. ట్రెండింగ్‌లో కొత్త సినిమా NKR21 లుక్
NKR21 | ఇవాళ నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) పుట్టినరోజు సందర్భంగా మూవీ లవర్స్ కు కొత్త సినిమా అప్డేట్ అందించాడు. కల్యాణ్‌రామ్ కొత్త ప్రాజెక్ట్ NKR21 (వర్కింగ్ టైటిల్).
NKR21 | బింబిసార సక్సెస్ తర్వాత ఫుల్ జోష్‌లో ఉన్నాడు నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram). ఈ నందమూరి హీరో కాంపౌండ్ నుంచి ఇప్పటికే డెవిల్ (Devil – The British Secret Agent) వస్తోంది. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్న డెవిల్ గ్లింప్స్ విడుదల చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తోంది. కాగా ఇవాళ కల్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ లవర్స్ కు కొత్త సినిమా అప్డేట్ అందించాడు. కల్యాణ్‌రామ్ కొత్త ప్రాజెక్ట్ NKR21 (వర్కింగ్ టైటిల్).
NKR21 సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిడికిలి బిగించి ఉన్న కల్యాణ్ రామ్ చేతిపై రక్తపు మరకలుండటం చూడొచ్చు. యాక్షన్ జోనర్లో వస్తున్న ఈ సినిమాతో ప్రదీప్ చిలుకూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అశోక క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. అలా ఎలా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అశోక క్రియేషన్స్‌కు ఇది రెండో సినిమా. అశోక్ వర్ధన్ ముప్ప, సునిల్ బలుసు, ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే డెవిల్ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. పీరియాడిక్ స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న డెవిల్ గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. డెవిల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. డెవిల్ చిత్రాన్ని దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. డెవిల్కు శ్రీకాంత్ విస్సా (Srikanth Vissa) కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.
NKR21 లుక్..
The FIST of FURY 🔥👊🔥@NANDAMURIKALYAN in an action-packed powerful role ❤️🔥#NKR21 shoot begins soon 🔥#HappyBirthdayNKR @PradeepChalre10 #AshokaMuppa @SunilBalusu1981 @harie512 @AshokaCOfficial pic.twitter.com/qb9S2TwCee
— NTR Arts (@NTRArtsOfficial) July 5, 2023
డెవిల్ గ్లింప్స్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

