Bimbisara update | ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులను మాత్రం విభిన్న కథలతో ఎంటర్టైన్ చేస్తుంటాడు నందమూరి కళ్యాణ్ రామ్. చాలా కాలం తర్వాత ‘118’తో తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గాను ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘బింబిసార’ ఒకటి. మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఫాంటసీ యాక్షన్ ఫిలిం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం అప్డేట్లను మొదలు పెట్టింది.
ఈ చిత్రానికి సంబంధించిన మేజర్ అప్డేట్ను శుక్రవారం సాయంత్రం 5.09 నిమిషాలకు వెల్లడించనున్నట్లు మేకర్స్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దాంతో సినిమాకు సంబంధించిన గ్లింప్స్గాని, టీజర్ అప్డేట్ గాని రాబోతుందని నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ రెండు విభిన్న కోణాల్లో సాగే పాత్రల్లో కనిపించనున్నాడు. ఇటీవలే విడుదలైన పోస్టర్లో ఒకటి పౌరాణికంగా మరోకటి స్టైలిష్‌లుక్‌లో కళ్యాణ్‌రామ్ కనిపించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ అర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్, వారినా హుస్సేన్‌లు కథానాయికలుగా నటించనున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.
Get ready for a Blasting update today at 5:09 PM 💥💥#Bimbisara is all set for a royal entry 🔥🔥
Stay tuned to @NTRArtsOfficial.#BimbisaraOnAugust5th@NANDAMURIKALYAN @DirVashist @CatherineTresa1 @iamsamyuktha_ @Warina_Hussain @mmkeeravaani @ChirantannBhatt @anilpaduri
— NTR Arts (@NTRArtsOfficial) July 1, 2022