Kalyan Dev | మెగా అల్లుడు ఇలా మారిపోయాడేంటి.. కళ్యాణ్ దేవ్ బెస్ట్ ఫీస్ట్..

Kalyan Dev | తన మూడేళ్ల కెరీర్లో ఎప్పుడూ లేనంతగా ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలుస్తున్నాడు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్. చిరంజీవి చిన్న కూతురు శ్రీజతో పెళ్లి అయినప్పుడు కూడా ఇంతగా ఈయన గురించి వార్తలు వచ్చి ఉండవు. కానీ ఆమెతో విడిపోతున్నాడు అని తెలిసినప్పటి నుంచి కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాడు. చిరంజీవి చిన్న కూతురు విడాకుల గురించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం అది జరిగేలాగే కనిపిస్తోంది. పైగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శ్రీజ, కళ్యాణ్ దేవ్ ఇద్దరు సైలెంట్ అయిపోయారు. మరోవైపు తన చెల్లిని తీసుకొని ట్రిప్ వెళ్లిపోయాడు రామ్ చరణ్. ఇవన్నీ చూస్తుంటే అభిమానులకు లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
తనపై ఎన్ని వార్తలు వస్తున్నా కూడా కళ్యాణ్ దేవ్ మాత్రం ఏమాత్రం స్పందించడం లేదు. హాయిగా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. తాజాగా ఈయన మేకోవర్ చూసిన తర్వాత అందరూ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా కండలు తిరిగిన దేహంతో బీస్ట్ అవతారంలోకి వచ్చాడు కళ్యాణ్. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నీకు జనం ఏదైనా చెబితే అది నువ్వు పెద్దగా పట్టించుకోకు.. ఒక నవ్వు నవ్వి వదిలేయ్.. నీకు నచ్చింది నువ్వు చెయ్.. అంటూ ఒక పోస్ట్ కూడా పెట్టాడు కళ్యాణ్ దేవ్. మొన్న సంక్రాంతికి సూపర్ మచ్చి సినిమాతో వచ్చిన ఈయన.. త్వరలో కిన్నెరసాని అంటూ వస్తున్నాడు. ఒకవేళ నిజంగానే చిరంజీవి కూతురుతో విడిపోతే మాత్రం కెరీర్ పై ప్రభావం చూపించడం ఖాయం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
మెగా కుటుంబం అల్లుడిని దూరం పెట్టడానికి కారణం అదేనా..?
Ram Charan | సోదరిని సంతోషంగా ఉంచేందుకు రాంచరణ్ ట్రిప్..!
Kalyan dev |మెగా అల్లుడు కెరీర్ ముగిసినట్లేనా.. ఏం జరగబోతోంది..?
Renu desai reentry | రవితేజ సినిమాతో రేణు దేశాయ్ రీ ఎంట్రీ !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

