Kalki 2898 AD | రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవెటెడ్ మూవీ ‘కల్కి AD 2898’ సందడి మరో 4 రోజుల్లో మొదలు కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఒక్కొక్కటిగా అప్డేట్లు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్, ట్రైలర్లతో పాటు ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా మాస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కల్కి థీమ్ అంటూ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్.
శ్రీకృష్ణుని జన్మస్థలం అయిన ఉత్తర ప్రదేశ్‌లోని మథుర నగరంలో ‘థీమ్ ఆఫ్ కల్కి’ పేరుతో కల్కి టీమ్ ప్రత్యేక పదర్శన చేసింది. సీనియర్ నటి శోభనతో పాటు పలువురు నృత్యకారిణులు యుమున నది ఒడ్డున సాంస్కృతిక నృత్య ప్రదర్శన చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫుల్ వీడియోను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.