Kalki 2898 AD | ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా 2024 జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కల్కి విడుదల తేదీకి సంబంధించి తాజాగా అప్డేట్ ఇచ్చారు దర్శకుడు నాగ్ అశ్విన్.
‘కల్కి 2’ ఎప్పుడు విడుదలవుతుందని నాగిని మీడియా అడుగగా.. ‘‘కల్కి’ని 3, 4 గ్రహాలు ఒకే వరుసలో ఉన్నప్పుడు రిలీజ్ చేశాను. దాని సీక్వెల్‌ను కూడా ఇప్పుడు 7, 8 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు విడుదల చేస్తాను. కాస్త ఆగండి అంటూ సమాధానమిచ్చారు.
ఫస్ట్ పార్ట్‌లో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించారు. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు. మరి సీక్వెల్లో ఎవరెవరు కనిపించబోతున్నారు.. కొత్త పాత్రలు ఏమైనా యాడ్ కాబోతున్నాయా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.