Kalki 2898 AD | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి ఏడీ 2898 (Kalki). ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్లు విడుదల చేయగా యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు తాజాగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. గత శుక్రవారం ‘ఇండియా బిగ్గెస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది వేచి ఉండండి అంటూ కల్కి టీమ్ రాసుకోచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ భైరవ యాంథెమ్ ఫుల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఇక ఈ పాటను ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసంజ్ పాడాడు. సంతోశ్ నారాయణ్ సంగీతం అందించాడు.